కవి సమ్మేళనం



ఈ బ్లాగ్ లో పొందుపరచిన కవితలు నా సొంత కవిత్వం కాదు ..
కేవలం వివిధ కవులు రాసినవి సేకరించి పొందుపరచడమైనది ...
అసలైన కవులకు కృతజ్ఞతలతో కూడిన అభివందనములు 





రాయాలని ఉంది నీకొక లేఖ
కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక...
ఇకపై నిన్ను చూస్తానో లేదో అన్న బాధ గుండె లోతుల్లో దాచుకోలేక...
నువ్వంటే నాకు ఎంత అనురాగమో నీకు చెప్పలేక...
ఈ నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక..
...రాయాలని ఉంది నీకొక లేఖ



అదృష్టంతో పైకి వచ్చినవాడు చెట్టు ఎక్కటం మాత్రమే తెలిసినటువంటి వాడు, స్వయంకృషితో పైకి వచ్చిన వాడు చెట్టు ఎక్కటం, దిగటం తెలిసినటువంటి వాడు. మొదటి వాడు ఎప్పుడూ పడిపోతానెమో అనే భయంతో ఉంటే, రెండోవాడు పడినా పైకెక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు.





నా హృదయం ఒక బండరాయి అని నీవంటే,

శిల్పి చేక్కితేనే శిల్పమవుతుంది అని నేనంటాను..

రాయిలాంటి నా హృదయాన్ని
నీకు నచ్చిన శిల్పంగా మార్చే శిల్పివి నీవంటాను..
 — 









నీతో గడిపిన క్షనాలను తలచుకొంటూ నువ్వు లేని క్షనాలను గడుపుతున్నా..!








కలే కదా అని చిన్నచూపు చూస్తే.. మనసు కల్లోలమవుతోంది..

పోనీ, పట్టించుకుందామంటే హృదయం విలవిల్లాడిపోతోంది..
నీతో గడిపిన క్షనాలను తలచుకొంటూ నువ్వు లేని క్షనాలను గడుపుతున్నా..!














సృష్టిలో తీయనిది స్నేహమేనోయి’ అని ఓ కవి అంటే, ‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అన్నాడు మరో కవి. ఎవరైనా స్నేహాన్ని అంతలా పొగుడుతూ పాటలు రాశారంటే అందులోని మాధుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు. అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ణి పొందటమే కష్టం.

కొన్ని స్నేహాలు పారిజాతాలు.
కొన్ని స్నేహాలు గులాబీలు.
కొన్ని స్నేహాలు కాగితం పూలు.
కొన్ని స్నేహాలు నైట్ క్వీన్లు.
కొన్ని స్నేహాలు ఆకుపచ్చని సంపెంగలు.
కొన్ని స్నేహాలు కలువపూలు.
కొన్ని స్నేహాలు చంద్రకాంతలు.
కొన్ని స్నేహాలు సన్నజాజులు.
కొన్ని స్నేహాలు బంతులు,చామంతులు.
కొన్ని స్నేహాలు కనకాంబరాలు.
కొన్ని స్నేహాలు పొద్దుతిరుగుళ్ళు.

ఇలా ఎన్ని రకాల స్నేహాలు ఉన్నా నిజమైన స్నేహితులకు తెలిసిన మంత్రమొక్కటే --
ప్రపంచం తలక్రిందులైనా వీడకుండా నిలవటం.
కొందరినైనా నాకిచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు.

బ్లాగ్మిత్రులకూ..
నా ప్రియ మిత్రులకూ..
మిత్రులందరికీ...

వన్నె చిన్నెల స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...










 

కలలున్న మనిషికి కన్నీరెక్కువ

మనుసున్న మనిషికి మరణయాతన లెక్కువ
కదిలి పోయే కాలానికి తొందరెక్కువ
మరణించే జీవికి మక్కువెక్కువ
వీచే గాలికి భందమెక్కువ
...పారే జలపాతానికి పరువళ్ళు మక్కువ
కన్నీరుకి కనికరమెక్కువ..
జాలి లేని హృదయాలకు నిరాశలెక్కువ..
ఈ విధంగా అన్నింటిని గురించి చెప్పే
నాకు నీపై ప్రేమ ఎక్కువ...









 

మౌనాన్ని ప్రేమిస్తున్నా...నీ మాటలు వినిపించాలని...

వీచే గాలిని సైతం ప్రేమిస్తున్నా...నిను తాకి నను చేరుతోందని...
పగటిపూట కూడా నిద్ర పోతున్నా....స్వప్నంలో నిను చూడొచ్చని...
నీ పాద స్పర్శ తగిలిన నేలను చూచి ఈర్ష పడుతున్నా...
ఆ భాగ్యం నాకు కలగలేదని...కలుగుతుందని ఆశలేదు
అయినా ఏమీ చేయలేక నిస్సహాయంగానే ఇలా కుర్చునా...









సముద్రం లో అల ప్రతిక్షణం తపిస్తూ వుంటుంది,

తాను ఏ క్షణనైనా ఆకాశాన్ని తాకాలని...

నాలో ఉన్న మనసు తపిస్తూ వుంటుంది,
ఏ క్షణనైనా నిన్ను చేరాలని...
కానీ సముద్రం లో అలకు తెలుసు
...తాను ఆకాశాన్ని తాకలేనని
నాలో ఉన్న మనసుకు తెలుసు
నేను నీన్ను చేరలేనని...
కాని అలలా ప్రయత్నిస్తూనే ఉంటుంది


నేను, నాది, నాకు అనే పదాలు 'స్వార్థానికి పర్యాయపదాలు'..
మనము, మనది, మనకు అనే పదాలు 'స్వార్థానికి వ్యతిరేకపదాలు'..
స్వార్థం నిండిన మనసు ఎన్నటికీ ఒంటరే..
'నేను' అనే పదంలో 'కలవని పెదవులు',
'మనము' అనే పదానికి 'కలుస్తాయి'..
కలిసిన పెదవులకే కదా ముద్దు ముచ్చట..!!!



--------కలికాలం-------
మనసున మమతే లేకున్నది ఈ మనుషులలో,
చెలిమికి చేదలే పట్టెను ఈ స్వార్ధం తో ,
సంస్కృతి నడీ సంద్రమున మునిగెను ఈ సంపాదనతో ,
గురువుకు గౌరవమే లేకున్నది ఈ చదువులలో ,
సంస్కారము సుడిగాలిలో ఎగిరినది ఈ సమయం లో,
కలముకు కవితే రాకునది ఈ కలికాలంలో ..



ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు,
ప్రేమంటే పెదాలు సైతం పలకలేని మదుర భావాలు....

కల్మషం లేకుండా మాట్లాడవనుకున్నాను కాని...
కాలక్షేపం కోసం మాట్లాడవని తెలుసుకోలేక పోయాను..



జననం ఒక సుప్రభాతం
మరణం ఒక సంధ్యా గీతం
రెండింటి మధ్య జీవితం సుఖ-దుఃఖాల సంగమం
అందులో మన ప్రేమ ఒక అమృత కావ్యం...

ప్రకృతి పాటం.........
ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది -
- జీవించే ఒకరోజైనా అందంగా బతకాలని...
ఒక ఆకు రాలుతూ చెప్పింది -
- ప్రాణం శాశ్వతం కాదని....ఎన్నటికైనా రాలిపోవల్సిన్దేనని....
ఒక చెట్టు జాలిగా చెప్పింది -
- తను కష్టంలో ఉన్నా ....ఇతరులకు నీడనివ్వమని...
ఒక కొవ్వొత్తి కరుగుతూ చెప్పింది -
- తనలాగే చివరిక్షణం వరకు పరులకు సహాయపడమని ...
ఒక మెరుపు గర్జిస్తూ చెప్పింది -
- దైర్యం ఒకరి సొంతం కాదని...
ఒక పక్షి ఎగురుతూ చెప్పింది -
- తనలాగే హయిగా ఉండమని...
ఒక కొండ పగులుతు చెప్పింది -
- తారతమ్యం లేక అందరికి ఆశ్రయమిమ్మని

వస్తువు పగిలితే శబ్దం వస్తుంది,
కానీ మనసు పగిలితే నిశబ్దం మాత్రమే మిగులుతుంది.
కావ్యం లాంటి నా జీవితంలో కరిగి పోయేకాలానికి, చెరిగిపోయే రాతలకు మిగిలిపోయే ఒకే ఒక తీయనిజ్ఞాపకం నీతో ఈ స్నేహం

మేఘం కరగట్లేదు... వర్షం కురవట్లేదు..,
కాని నీ ఆలొచనల మద్య నేనింకా తడుస్తూనే ఉన్నా..!

జీవితం అనే ప్రమిదలో
ఆశలు అనే నూనె పోసి
ఆశయం అనే వొత్తి వేస్తే
దేదీప్యమానంగా వెలుగుతుంది జీవనదీపం....!!

ఆశలు అనే నూనె లేకపోతే
ఆశయం అనే వొత్తి కాలిపోతుంది
ఆశయం లేని జీవితం వ్యర్థమే కదా...!!

మదిలోన విరిసేను ముద్ద మందారం 
పెదవులపై మురిసేను సిరిమల్లి సింగారం,
కనులలో కదలాడెను కన్నె కనకాంబరం,
తనువున మెరిసేను పచ్చటి బంగారం,
తీయటి తలపుల కొలువు మనసే మందిరం....
గతకాలపు జ్ఞాపకాలు విత్తులే కదా అని ఓ మూలకి విసిరేసా
ఊడలతో సహా పెరిగి మనసంతా అల్లుకుపోయాయి....!




నిన్ను చూడకనే నీ చిత్రాన్ని వేయగలను
నిన్ను కలవకనే నీ మదిని చదవగలను
నీ భాధని నా కంటనీరుగా కురిపించగలను
నిన్ను మరువమని నామదికి ఎలా చెప్పను!

జీవితం పెద్దదో, చిన్నదో?గమ్యం దగ్గరో, దూరమో?
సాగే నిరంతర ప్రయాణంలో,చివరకు మిగిలేది,
గుప్పెడు జ్ఞాపకాలు,పిడికెడు అనుభూతులు…

ఆనందం, విషాదం,చెరో చెయ్యి పట్టుకుని, జీవితాన్ని నడిపించేస్తున్నాయి,
అదేమిటో,ఆనందానికి అప్పుడప్పుడు అలుపన్నా ఉంటుంది,
విషాదానికి ఎన్నడూ అలసటే ఉండదు!

మనసు ముక్కలవ్వాలంటే,యుద్ధమే జరగాలా,
చిన్న మాట సరిపోదూ?
బాధని చూడాలంటే,కన్నీరే కారాలా,
కళ్ళలో భావం సరిపోదూ?

దూరం నుంచి అరక్షణం నిన్ను చూసినా...
నీ చిరునవ్వు చిరుక్షణం నన్ను తాకినా...
ఏదో తెలియని ఆనందం నాకు...

ఇంత విశాల ప్రపంచంలో మరెక్కడా చోటే లేనట్టు....చిన్నని నా హృదయంలో దూరి గుండె చప్పుడును లాలిపాటగా మార్చుకుని..నిద్రపోతున్నావా...!

అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లితంద్రులు గుర్తుకురారు....,
పెళ్ళిచేసుకునేప్పుడు ప్రేమిచినవాదు గుర్తుకురాడు....... ;)
 —





రాయి తగిలితే నొప్పిరానిదెవ్వరికి...గుండె పగిలితే కన్నీరు పొంగనిదెందరికి...జీవితమన్నాక కష్టం రాకుండాఉంటుందా...ఓ సుఖం వచ్చి ఆ కష్టాన్ని కష్టపెట్టకపోతుందా...?





నా ప్రాణం పోతే నీకు కన్నీలు వస్తాయో లేదో తెలియదు..కాని నీకు కన్నీలు వస్తే మాత్రం నా ప్రాణం పోతుంది..





కష్టం, కాలం, సుఖం వరుసగా, ఒకరిని అందుకోవాలని మరొకరు,
వృత్తాకారంలో తీస్తున్న పరుగుల్లో,పొంగినవి కన్నీరో, పన్నీరో,
తీరినవి కలతలో, కలలో,గుర్తేలేదు……





ప్రేమ అంటే అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు...అవతలి వారి చేత అర్థం చేసుకోబడటం కూడా...!



 

భాష ఏదైనా భావమొక్కటే గుండెకు.




అచ్చతెలుగు నుడికారంలా..మచ్చలేని మమకరంలా..
వచ్చినది కవితాగానం..నువ్విచిన ఆరోప్రాణం...




మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం..
పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం..
ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు...




ఊపిరి ఆగిపోయేవరకు నిన్ను మరవలేనని, ప్రేమ చిరకాలమని నిన్ను ప్రేమించాకే తెలిసింది..!!





నువ్వు లేని ఈ క్షణం చాల భారంగా గడుస్తుందని అంటుంటే
నాకు తెల్సు అంటుందీ జరుగుతున్న కాలం...
నీతో గడిపిన ప్రతీ క్షణం నాకో మధురస్వప్నం అని అంటుంటే
నాకు తెల్సు అంటుంది జరిగిపోయిన కాలం...
నువ్వు ఎప్పటకీ నాతోనే వుండాలని శాసించి..
ఉంటావని గర్వంగా అంటుంటే
నాకు తెల్సు అంటుంది జరగబోయే కాలం...

 —








చలిలో మంచు వానజల్లెందుకు!
మండుటెండలో మరిగే నీళ్ళెందుకు!
వసంతమే లేనప్పుడు కోయిల పాటెందుకు!
చూపే లేనప్పుడు దీపకాంతుల జ్యోతులెందుకు!
మనసుకి అయిన గాయానికి మందెందుకు!
నీవు లేని నేనెందుకు..ఎందుకు…..?








ప్రేమ భావన కలిగినప్పుడు పచ్చిమిరపను తిన్నా..పాయసం తాగినట్టే ఉంటుంది..అదేంటో మరి..!








ప్రేమించటం ఒక పిచ్చి, వెర్రి, పైత్యం అంటారు
కాని అసలైన ప్రేమ దేవుడిలాంటిది
దేవుడు కనపడడు, ఎక్కడా చూపించలేము,
కాని దేవుడు వున్నాడు అనే భావమే
ఈ ప్రపంచాన్ని బ్రతికిస్తున్నది....







గంగిగోవుపాలు గంటెడైన చాలు
కడివెడైననేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినురవేమ..

తాత్పర్యము : మంచి ఆవుపాలు గరిటెడైను త్రాగుటకు శ్రేష్టముగా నుండును. గాడిదపాలు కడవతో ఇచ్చిననూ త్రాగలేముకదా: అట్లే ప్రేమతోబెట్టిన భోజనము పిడికెడైననూ సంతోషమేగదా...


 

గతం మరువలేక,
వర్తమానం గడుపలేక,
భవిష్యత్తును ఊహించలేక
ఈ బాధను భరించలేక..

మౌనంగా ఆక్రోశిస్తూ.. విలపిస్తున్నా...
మరణాన్నైనా దరిచేరమని దయతో, ఆర్ధిస్తూ! 

 

గుండెలో దాచుకొన్న నీ రూపం నా గుండెకే గాయాన్ని చేసినా..
కళ్ళల్లో దాచుకొన్న నీ అందం నాకు కంటి చెమ్మనే బదులిచ్చినా...
తెలియని నీ జాడ కోసం తపిస్తున్న నా మనసును చూస్తే
చిన్ని ఆశ లాంటి పెద్ద నిరాశ ఎదురోస్తుంది
ఆనంద బాష్పాల్లాంటి కన్నేటి శోకం మిగులుతుంది .. 

 

భూమి పై నీరు ఉన్నంత వరకు....చిత్ర గుప్తుడు చిట్టాలు వ్రాయునంత వరకు....నాలోని రక్తము ఎర్రగా ఉన్నంత వరకు....యముడు వాహనమ్ము(దున్నపోతు) పై వట్టేసి చెపుతున్న....
నీవు నేను వేరు కాదని....ఆ తలపే సరికాదని ....ఎన్నటికి మనము ఒకటేనని .... 

 

"నీకోసం కలలు కంటూ కూర్చునాన్ను...కాని వాటిని నువ్వు కలగానే చేసావు...
కన్నీటి దారలకు అర్దం లేకుండా చేసావు.. మరిక సేలవు తీసుకోనా నేస్తమా...మనుష్య్లులేని మరోలోకానికి.." 

 

మీ హృదయంలో ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది.కనుక అసూయకు దూరంగా ఉండండి.. 

 
కత్తి చేసే గాయం కన్నా, మాట చేసే గాయం లోతు..

శాశ్వితంగా శ్వాస ఆగిపోతే ఎంత బాగుండోకదా...విలువలేని ఊపిరి ఉంటే ఎంత పోతే ఎంత
ఈ రోజెందుకో గుండెళ్ళో కసిగా గునపాలతో పొడిచినట్టు అనిపిస్తుంది చెప్పలేనంత భాద..
ఆ పొడిచేవాళ్ళు కసిగా ఇంకా పొడుస్తూనే ఉన్నారు ...ఇంకా ఊపిరిపోలేదా అన్నట్టు...

నీ మనసులో నీకు ప్రశాంతత దొరకకపోతే మరెక్కడో దాన్ని వెతకడం వెర్రితనం...

మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి..

తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ’ఎందుకో నాకీ రోజు అస్సలు ఆకలి వేయ్యడం లేదు’ అని చెప్పే వ్యక్తి.. అమ్మ.. 

నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు..

నేస్తమా నీ అధరాల నుంచి చిరునవ్వుని ఎన్నడు దూరం కానివ్వకు...
నీ నవ్వులో నాలాంటి ఎందరో ప్రాణస్నేహితుల నవ్వు కూడా ముడిపడి ఉన్నది..

నువ్వు నాతో లేని క్షణం""నా నుంచి సంతోషం వేరవుతుంది నువ్వు దూరమైనంత తేలికగా..."

వీచే గాలి ఆగినా పరవాలేదు....కదిలే కలం ఆగిన పర్వాలేదు....కాని నా నేస్తం చిరునవ్వు ఆగిపోతే నేను తట్టుకోలేను..


ఊపిరాడని ప్రేమలోద్దు, తిరస్కరించే తీర్పులోద్దు,కావలసిందల్లా,నువ్వు నన్ను ప్రేమించు, నీ ప్రేమను నే గౌరవిస్తా,నేను నిన్ను గౌరవిస్తా, నా గౌరవాన్ని నువ్వు ప్రేమించు..


మనిషి ఎంత చిత్రమో, మనసు అంత విచిత్రం,అంతా అర్థం అయ్యినట్టే అనిపిస్తూ,
ఏమీ అర్థంకాని విశ్వరహస్యం మానవ మనసు..ఏ ఏ విషయాలకు ఏ మనిషి ఎప్పుడూ ఎలా స్పందిస్తాడో కనీసం మనిషిని సృష్టించిన దేవుడికైనా తెలుసా..?

ప్రేమ ఒక అందమైన ఊహైతే, ఆ ఊహకు ఊపిరి నువ్వు !!ప్రేమ ఒక కమ్మనైన కలైతే,
ఆ కలలో కల్పనవి నువ్వు !!ప్రేమ ఒక తియ్యనైన తలపైతే,ఆ తలపులోని చిలిపితనం నువ్వు !!
ప్రేమ నా మది పలికే రాగమైతే,ఆ రాగాన్ని పలికించిన స్పందన నువ్వు !!......


నిన్ను చూసాక తెలిసింది "మనిషి " విలువ..మాట్లాడితే తెలిసింది "మనసు "విలువ..నిన్ను కల్సాక తెలిసింది "కాలం"విలువ.. కలిసుంటే తెలిసింది "సంతోషం " విలువ..నీ గూర్చి ఆలోచిస్తే తెలిసింది "ఆశ " విలువ..నువ్వు దూరం అయితే తెలిసింది " కన్నీటి " విలువ...నీ తేనె మనసుకు తెలియలేదా .. "నా తీపి బాధ " నీ ఆలోచనలతో గడుపుతున్నా నా "భాద" ఎప్పటికైనా తెల్సుకుంటావని...


ప్రపంచం అంతా నీకు ఎదురు తిరిగినా, నీవారే నీకు కాకుండా పోయినా…బాధలో నిన్ను ఓదార్చడానికి, సంతోషంలో నిన్ను కౌగలించుకోవడానికి ఒక మనిషి కావాలి. అది నువ్వే అయ్యుండాలి...
నిజమైన ప్రేమకి నిజాయతి గా ఉన్న మనిషికి విలువ లేదు. అబద్దాన్ని అందం గా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది..


వందలాది ఈ అక్షరాల్లో అర్ధం కానివి ప్రే.. మ.. అనే రెండు అక్షరాలేగా..పొతే పొనీ..అర్ధం కాకపొతే పొనీ..కొట్లాది గుండె చప్పుల్లలో అగేది ప్రేమ కొల్పోయిన ఈ ఒక్క చప్పుడేగా పొతే పొనీ..చివరికి నా ఈ పంచ ప్రాణాలలో పోయేది నువ్వైన నా ఈ ఒక్క ప్రాణమేగా పొతే పొనీ..ప్రాణం పొతే పొనీ ...

ఎదురుచూస్తే వచ్చే వెలుగు కంటే ...కన్నులు మూస్తే వచ్చే చీకటే నయమనిపిస్తోంది..నిన్నటిని మరువలేక ..నేటిని బరించలేక జీవిస్తున్నా భారంగా...
పుట్టి మనం ఏడుస్తాం..పోయి మనవాళ్లని ఏడిపిస్తాం..పుడుతూ తెచ్చుకున్నదాన్ని
పొతూ ఇచ్చేస్తామన్న మాట...


పుట్టినప్పుడు తెలియదు ఏదో ఒకరోజు మరణించాలని..తప్పటడుగులు వేసేటప్పుడు తెలియదు జీవితంలో గెలవాలంటే పరిగెట్టాలని..ఇష్టపడేటప్పుడు తెలియదు కష్టాలెప్పుడూ ఇష్టాల చుట్టే ఉంటాయని.. 


చందమామలా వెన్నెల కురిపించావు 
నేను పోగొట్టుకున్న స్నేహాన్ని మళ్ళి అందించావు
క్షమాపణల వారధి ఎందుకన్నావు 
జీవితమనే చదరంగం లో అందరమూ పావులమే అన్నావు   
ఒక అందమైన జ్ఞాపకముల కొలువున్నానన్నావ్ 


నా నవ్వులని కన్నీటి వర్షంలో ముంచావు 
కానీ నీ జ్ఞాపకాల జడి వాన ఇంకా...., 
నా మనసులో కురుస్తూనే వుంది,...!! 

నా కన్నీటి కథలని,తీరని 
వ్యథలని ఏమని చెప్పను,...??
నా గుండె గుహలో గుడు కట్టుకున్న 
నీ జ్ఞాపకాలని ఎంతని చెప్పను,...??
ప్రేమించినందుకు పాముల కాటువేశావు
పుజించినందుకు నిప్పుల కాల్చావు,....
అరాదించినందుకు ఆనందం దోచుకుపోయి,
భాదని తోడు చేశావు,......
నమ్మినందుకు సుదిర్గ నరకాన్ని అనుభవించేలా చేశావు
కానీ నేస్తం ఒక్కసారి నీ స్నేహాన్ని,మన గతాన్ని
అడుగు నా ప్రేమ నువ్వంటున్న ఆకర్షణ అని,..!!


చెలి
నీ కళ్ళు లేత కలువ పళ్ళు
నీ పెదవులు వాడని పూ తోట
నీ నవ్వు రంగుల హరివిల్లు....,
నీ నడక పారే సెలయెరు.......,
నీ నడుము వొంపు నింగిలోని మెరుపు
నీ రూపం అజంతా శిల్పం........,
నీ భావం బాపు గీసిన చిత్రం......,
నీ నామం కాళిదాసు ప్రేమ కావ్యం.....,
ఇలా మూడు లోకాల అప్సరసల అందంతో
సృష్టించిన ఈ బొమ్మను చేరట అది సాద్యమా....??
నీ ప్రేమను పొందితే ఇది నా బ్రతుకికి భాగ్యమే,...!
హిమ సమీరంలా... 
నిశా తుషారంలా...
గుండెను తాకును ప్రేమ...
గుర్తులు నిలుపును ప్రేమ...
నాన్న మనల్ని నడిపించే దైవం
కుటుంబానికి వెలుగై మనకు
వెలుగు పంచేది నాన్న
అమ్మ నాన్న చూడటానికి
రెండు అక్షరాలు మాత్రమే
పలుకుతున్నపుడు ఏదో తెలియని
ఆత్మీయత మనల్ని నడిపించినట్టు అనిపిస్తుంది
నీ జీవితానికి ఒక మార్గదర్శకం నాన్న
నీ వీజయాలకు పూనది నాన్న
నీ అడుగులకు గుండె చప్పుడు నాన్న
నీ బాధలకు ఓదార్పు నాన్న
నీ సంతోషాలకు చిరునామా నాన్న
ప్రేమను నింపడములో ప్రేమను
పంచడములో కన్నా తల్లి తండ్రుల తరువాతెనే
ఎవరు అయ్యిన ........
ఎవరు తమ తల్లితండ్రులను మరిచిపోకండి
ప్రతి నిత్యమూ వాళ్ళకు తోడు నీడగా ఉండండి ...
వెనకే నీడలా ఉన్నా
కనుపాప గుర్తులు కూడా నా మీద పడనన్నాయా
పర్వాలేదు చెలి
నీ ఊపిరి వెక్కిరింపైనా నా చుట్టూ చేరుకుందిగా
నను చూడకున్నా
నీ మదికెప్పుడో చేరువయ్యానని నాకు తెలుసు సఖి
ఏదో మాయచేసి నా గుండెను లాగావు,
నీవైపు మళ్ళించి నడిసంద్రంలో ముంచేసి వేల్లిపోయావు
ఏపాపం చేసానని హుందాగా నాహృదయంలో నిదురించావు
కాలం మనది కాదని,నిదురలో నువ్వు ఒంటరేనని,
పాపం ఏవ్వరిదోతెలియక...దూరం ఏజన్మ శాపమో తెలియక,
అనుక్షణం నేనుఒంటరినేనని నిజాని మతులో ముంచి,
నీకోసం బ్రతకడానికోస్తే నువ్వు ఒక్కరిదాసోహం అయ్యావు,
నీప్రేమకు నోచుకోని ఆకాశాన చుక్కను అయ్యాను.
బంగారాన్ని పరిక్షి౦చాలంటే నిప్పు కావాలి

మనిషిని పరిక్షి౦చాలంటే నిప్పు లాంటి కష్టం కావాలి

అప్పుడే మనిషి గుణం , విలువ బయటపడుతుంది 

ప్రతి మనిషి జీవితంలో రెండు అనుకోకుండా వస్తాయి ,

అవి వచ్చినట్టు మనకే తెలియదు

భావాలు వేరు అయిన రెండు చేసే పని ఒక్కటే ,,,,,,

ఒక దాని రాకతో హృదయమంత పులకిస్తుంది

ఇంకోదాని రాకతో హృదయస్పందనే ఆగిపోతుంది

అవి

ఒకటి “ ప్రేమ “

ఇంకొకటి “ చావు “

రాటుదేలిన గుండెలోనూ..
రాగాలు పలికిస్తుంది ప్రేమ..
రమ్యమైన భావాలకి 
నెలవై నిలుస్తుంది ప్రేమ..

ప్రియా,,,,

నీను చుసిన తరవాత 

నేను కనులు తెరవడం మరిచా 

ఎందుకంటే

కనులు మూస్తే నీ అందమైన రూపమే కనిపిస్తోంది 

నిన్ను మర్చిపోవాలన్న ప్రతి క్షణం.....,
నన్ను వెంటాడే నీ జ్ఞాపకాల గతం.....,
నిన్ను ప్రేమించడం నేర్చుకున్న హృదయం
ఎడబాటుకు చేరువై,చేరమన్నది మరణ వలయం
నీ కౌగిలిలో ఒదిగిపోవాలన్న కోరిక లేదు.....,
నీ మనసులో చోటు సంపాదించాలన్న ఆశ లేదు...,
నీ చేయి అందుకోవాలన్న ఆత్రత లేదు.....,
నీతో గడిపిన రోజులు మళ్లి రావాలని.....,
ప్రేమగా నీ యదపై కలకాలం నిదురించాలని....,
నీ స్నేహం నన్ను దూరం చేయక ముందే.....,
నా శ్వాస గాలిలో చేరిపోవాలని,.....
ఇట్లు నీ నేస్తం,..


ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలంటే ,
ప్రతిఉదయం ఒక చక్కని సంకల్పంతో
నిద్రలేవడం మంచిది ,
(స్వామి వివేకానంద )

ఎలా చెప్పను...
ఎదురై వచ్చిన నా కల..
నను ఏమరుపాటుకి గురి చేస్తుంటే..
ఇంకెలా చెప్పను..
రేరాజై వచ్చిన నా రాజు..
నా మనసుని కట్టిపడేస్తుంటే..

ప్రేమా...
నీ అలజడి నను చిత్రంగా కవ్విస్తోందే..
ప్రియవిభుడి సన్నిధికై ఆత్రంగా తపిస్తోందే.





నాలో పెనుతుఫాను రేపి అలజడుల
సుడిగుండంలో ముంచి నువ్వు వెళ్ళిపోయావు.
నన్ను కాదని వెళ్ళిన, నీ జ్ఞాపకాలు వదలేక
నా కళ్ళు శోకసముద్రంలో రోదిస్తూన్ననై .
ఏకాంతంలో జ్యోతివై మనసుని దహించి
నా నమ్మకానికి సంకెళ్ళు వేశావు.
చిరు నవ్వుతో లేనిపోని ఆశలు పుట్టించి
నా గుండెను ముక్కలుగా చేశావు.
చనువుగా నువ్వే మాటలాడుతూ
నన్ను వంచించి నా ప్రేమకు గోరి కట్టావు.
కాని ఎందుకు ఇలా చేశావని నిన్ను
అడగను కారణం నీకే తెలుసు.

మనసులో చితి మంటలు రేపి
కలలకు సంకెళ్ళు వేసి,.....
కదిలిన నేస్తం హృదయం...,
వుంటే వినమంటున్న నా గోడు....!!
కోటి జ్ఞాపకాలు నింపుకున్న.......,
కనుపాపలు కన్నీటి కడలాయనే....,
పలు ప్రేమ రాగాలు నేర్చుకున్న....,
పెదవులు మూగ స్వరమాయనే.....,
వెచ్చని ఉహల్లో వెలుగుతున్న.....,
ఆశలు అరిపోయనే......,
పల్లవిస్తూ పరుగెత్తిన అడుగులు
నిశ్చలమాయనే.......,
నీ తోడులేని క్షణాలతో ఒంటరిగా బ్రతకలేకున్న
నా గుండెకి తగిలిన గాయాలతో భాదను ఒర్చుకోలేకున్న
నీ ప్రేమ వంచనకి ఈ నిజాలని తలచుకోలేక,
ఇకపై కడదాకా నీతో నిలువలేని నా శ్వాసనీ విడి
లోకానికి వీడ్కోలు చెప్పేస్తున్నా.,...!!

నా ప్రతి అడుగులో నీవే
నా ప్రతి మాటలో నీవే
నా ప్రతి చూపులో నీవే
నా ప్రతి కదలికలో నీవే
నా గుండేల్లో నీవే
నా శ్వాసలో నీవే
నా ఊపిరిలో నీవే
నాలో సగ భాగం నీవే
నా గేలుపు నీవే
నా సంతోషం నీవే
అంత నీవే అన్ని నీవే ........

నెరవేరని కలలెందుకు..
ఆచరణ చూపని ఆశలెందుకు..
తెలిసి తెలిసి భ్రమలెందుకు..
అదే పనిగా ఊహలెందుకు..

వాస్తవమేదైనా తలవంచు..
నీ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించు..
మార్పు ఏదైనా ఆహ్వానించు..
మనసా వాచా దాన్ని సాధించు..

దారి మార్చినంత మాత్రాన గమ్యం మారినట్టు కాదు..
లక్ష్యం మారినంత మాత్రాన సత్తా తగ్గినట్టు కాదు..
నిన్ను నీవే మలుచుకోవోయ్..వీరుడిగా..శూరుడిగా..
ఎవరేమన్నా సాగిపోవోయ్..ధీరుడిగా..కార్య సాధకుడిగా..

నీ మాటే వేదమవ్వాలి...
నీ బాటే ఆదర్శ పథం అవ్వాలి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే..
మొదలు పెడితే జగమంతా నీ తోటిదే..

కన్నిటికి తెలుసు తనని ఎవరో ఖాలి చేస్తున్నారని,....
మనసుకెందుకు తెలియనంటుంది......
కన్నిలను తుడిచే చేతులు ఇక రావని ,......!!
ఒకరినెందుకు అడగాలి దుక్కించ మంటుంది బ్రతుకు భారం,...
ఏమిటో గొడవ చేస్తోంది గుండె గదిలో నిదురిస్తున్న జ్ఞాపకం,...!!
కరిగిపోతున్న స్వప్నమా, గతించిపోతున్న గమ్యమా
నను గుడిలో దేవతగా కొలువుంచుతవా,,,,??
ఆలయ హరతినే నా చితికి మంటగా వేస్తావా,..??



ఎర్రని సూర్య కిరణాన్ని గులాబి చేసి
నీ కురలలో తురమాలని ఆశ,....
రంగుల హరివిల్లుని కరిగించి నీ,....
నడుముకి ఒడ్డియనం చేయించాలని ఆశ
మిల మిల మెరుపులా ఉరములను తెచ్చి
నీ కళ్ళకి కాంతిగా మార్చాలని ఆశ,.....
దిష్టి చూపలని కాటుక చేసి నీ,.....
కనుబొమ్మలకి సైగ చేయాలని ఆశ
పిల్ల గాలికి సంకెళ్ళు వేసి నీ పడుచు అందం
మోసే చుక్కల పల్లకి తెప్పించాలని ఆశ
నా ఆణువణువూ నిండిన నీ జ్ఞాపకాల
అల్లికకు నా జీవితం అంకితం,

అనధలమ మేము అనధలమ
ఏ తల్లి వడిలో నుంచి వచ్చి ఈ తల్లి చెట్టు పై వలాము మేము
పది నేలలు మోసిన కన్నా తల్లికి నేను బరువు అయ్యాను
పుట్టగానే అమ్మను దూరం చేసుకున్న న తప్ప
కనగానే దూరం చేసుకున్నఅమ్మ తప్ప
భగవంతుడ ఎవరిలో వుంది అ తప్పు

మ్మ అన్న పిలుపు ఆప్యాయంగా వుంటుంది దానికి దూరం అయ్యి బ్రతుకుతున్నాను ఇప్పుడు

ఎప్పుడు పుట్టమొ తెలియదు ఏ తల్లి వడిలో పుట్టమొ తెలియదు కాని మేము అనధలము అయ్యాము
అ కన్న తల్లి నన్ను దూరం చేసుకునందుకు మనో వేదనకు గురి అవ్వడం లేద

పక్షి తన పిల్లలకు జన్మనిస్తే అ పక్షి
తన పిల్లలకు రెక్కలు వచ్చే వరకు కాపడుతునే వుంటుంది
మరి మమ్ములను అల అనాధలుగా పడి వేయడం నీకు న్యాయమేన అమ్మ
దారిలో చెత్త కుప్పల మద్య పెరిగిన నాకు
అమ్మ ప్రేమను కరువు అయ్యెల చేశావు కదా


అమ్మ తినడానికి తిండి లేక పడుకోవడానికి సరి అయిన దారి లేక పాదచారుల మద్యనే పడుకునన్ను కదా అమ్మ
ఎన్నో కష్టాల సాగరముల నడుమన బ్రతికిన నాకు నీ ప్రేమ కావాలని ప్రతి రోజు ఏడుస్తూ ఏడుస్తూ అ కన్నిలే ఆగేల చేశావే

అల దారిలో వెళ్తున్నపుడు ఒక పపాయితో ఆడుకుంటున్న అమ్మను చూసి మా అమ్మ కూడా ఇలానే ఎత్తుకుంటే బాగుండు అనిపించేది
పేద వాడిగా పుట్టడం నేను చేసిన తప్ప నీ వడిలో నుంచి వచ్చిన నేను నీకు బారం అయ్యాన అమ్మ పొట్ట కూటి కోసం ఒక కూలి వాడిగా ఉండి నిన్ను పోషించు కుందును కదా అమ్మ

నన్ను వీడి నువ్వు ఏడుస్తున్నావ్ నన్ను ఎడిచేల చేస్తున్నావ్ ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన తప్ప భగవంతుడ ఏది నీకు న్యాయం.......
సిరులెన్నో కురిపించే లక్ష్మి దేవి స్రీ కాదా
జలపాతానికి సాగరంల వుండే అ గంగ దేవి స్రీ కాదా
ఈ ప్రపంచాన్ని తన బుజ స్కందాల పై పెట్టుకొని నడిపిస్తున్న అ బుమాత స్రీకాదా
అయ్యిన మాకు ఎందుకు ఇంత శిక్ష దేవ
పురిటి నొప్పులు పడుతూ నన్ను కన్నా తల్లి ప్రేమను
మొగ్గలోనే తుంచి వేయడం నీకు సరి అయినదిగా అనిపిస్తుందా చెప్పు దేవ

ఏ తల్లికి ఇలాంటి శోకం కలగా కూడదు దేవ
అనాధగా మిగిలిన నాకు అమ్మ అనే ఒక అక్షర రూపంలో
వచ్చి అనాధ శరణాలయంలో చేర్పించినప్పుడు న మనస్సు కోటి పరవల్ల కాంతి తాకి ఒక కొత్త లోఖనికి వెళ్ళేల చేసింది అ అమ్మ
అ అమ్మ మా అమ్మ అయితే బాగుండు అనిపించేది

ఇలా దూరం అవుతన్న తల్లి ఆవేదన బిడ్డ ఆవేదనలు ఎన్నో ఉన్నాయి ఈ లోఖంలో ........

"ఖుషి "సినిమా లోని "ఆడువారి మాటలకి అర్థాలే వేరులే "అనే పాటకి పేరడీ
**************************************************
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
అర్థాలే వేరులే..అర్థాలే వేరులే..
అర్థాలే వేరులే..అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..

కసిరి విసిరి కొట్టినచో బాసు చేత బాధితుడే..
కసిరి విసిరి కొట్టినచో బాసు చేత బాధితుడే..
తనలో తానే ఏడ్చినచో ప్రేమ కోరే తాపసిలే..
తనలో తానే ఏడ్చినచో ప్రేమ కోరే తాపసిలే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..

మునిగా మౌనిగా మారినచో భార్య వలన పీడితుడే..
మునిగా మౌనిగా మారినచో భార్య వలన పీడితుడే..
మనసు వయసు మాటలనినా సృష్టినేలే రసికుడే..
మనసు వయసు మాటలనినా సృష్టినేలే రసికుడే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..

అమ్మ తర్వాత అమ్మై నావే..
అక్కగా పిలిచే బంధమైనావే..

కలిసి పుట్టకపోయినా కన్నీరు పెట్టావే..
కామెంట్స్ ఎన్ని చేసినా కమ్మంగా నవ్వావే..

మా వాడు మా వాడని మహాగొప్ప చేసావే..
మహేంద్రుడిగా ఎదిగేందుకు మద్దతుగా నిలిచావే..

మరపే లేనట్టు ప్రతి క్షణమూ పిలిచావే..
మనసెరిగి నా కలలు కళ్ళ ముందు నిలిపావే..

బుజ్జమ్మా ..నిన్నేపుడూ నే మరిచిపోనమ్మా...
నా ఎదలో నీ మూర్తినే నిలిపి నిత్యం ఆరాధిస్తానమ్మా.

హాయ్ రే హాయ్..జామ పండు రో..
చిలకపచ్చ రంగులో ఇరుగకాసిన కాయరో...
గులాబి రంగు గుజ్జుతో నోరూరించే చూడరో..
పాట ఉరవడిలో ఇది పల్లవిరో..
కన్నె అందాలకి ఇది పోలికరో...
కవ్వించే గుణాల నాయికరో...
వగరు.. తీపి..రుచుల మేలు కలయికరో..
హాయ్ రే హాయ్..జామ పండు రో..

అమెరికా లో ఇది పుట్టెను రో.. అవని అంతా విస్తరించెను రో..
ఆకులైనా ఔషధమేరో..గాయాలైనా మానునురో...
అతిసారం , క్యాన్సర్ల కైనా...ఈ ఫలమే చక్కని విరుగుడురో.....
హాయ్ రే హాయ్..జామ పండు రో..

నాదెప్పుడూ ఒంటరి పయనమే..
అంచనాలు, ప్రణాళికలు లేని గమనమే..

నాదెప్పుడూ ఒంటరి జీవితమే...
హితులు, సన్నిహితులు లేని తత్వమే...

నాకై నేను ఆలోచించేది తక్కువే...
నా అనే వాళ్లకి నేనెంత చేసినా తక్కువే..

నా అనే అస్తిత్వాన్ని నిలుపుకునే మక్కువే...
నా తోడై నిలిచే కలలకి నేనింకా లోకువే...


విశ్వ విక్యాత నటుడు నందమూరి తారకరామరావు గారి
నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగు కళామతల్లి
గూటిలో తాతమ్మ కల ద్వార బాల నటుడిగా పరిచయమైన ఆజనుబావుడు
నందమూరి బాలకృష్ణ గారు..........
నటుడిగా సాహసమే జీవితం ద్వార తెలుగు లోగిలికి పరిచయం అయ్యిన
వ్యక్తి బాలకృష్ణ గారు.............
నరసింహ నాయుడు సినిమా ద్వార నంది అవార్డు అందుకున్న వ్యక్తి
బాలకృష్ణ గారు............
ఇప్పటికి తన నటనతో సినిమా రంగములో అందరి అభిమానాన్ని
కూడ కట్టు కున్న వ్యక్తి బాలకృష్ణ గారు....
ఇంకా ఇలానే ఎన్నెనో సినిమాలను మనకు అందించాలని మనసారా
కోరుకుంటున్నాను ..............
ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్బంగా
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.........

"బాబూ.. ’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో .
"ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను.
"Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ.
"Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను.
"What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ.
"ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.


"ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer.
"ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.
జీవితం..... ఎంతో చిన్నది
కాని జీవితానుభవాలు అనంతం
క్షణకాలం ఊహల గమనం
మరిచిన మరుక్షణం నిజాల ఆగమనం
పీడకలల మరువలేనిది
నిజమని నమ్మలేనిది ఈ జేవితం
తొలి అడుగుతో సాగిన ఈ పోరాటం
చివరి అడుగుకు చేరిన తీరునా!
నిశబ్ద కొలనులో కమలం వెన్నలతో విరబూసినట్లు
స్తబ్దమైన నా హ్రుదయం నీ ప్రేమతో వికసించినది
నీ మోము చూచిన సూర్యుడు పున్నమిరేయని మబ్బుల మాటున దాగినాడు
నీ కనులు చుచిన కలువభామ కలవరపడినది
నీ మటలు విన్న కోయిల మూగబోయినది
నీ నడక చుచిన రాజహంస తనహొయలు మరచి నిన్ను అనుసరించినది
నీ రాకతో ప్రకృతి మైమరచి వసంతమని భ్రమపడినది
నీవు లేనిచొ నా హృదయమున సాగరతరంగాల అలజడి
నీవు నీను కలిసిన జీవితం....
ఒక లక్షాధికారి మరణశయ్యపై ఉండి కొడుకులిద్దరిని పిలిచి " నేను

చనిపోయానని తెలిసి మీరేం చేస్తారు ?" అని అడిగాడు.

" ఆ వార్తా విని నేను వుంటానా ? నీ చితిమీదికి దూకేస్తా " అని బోరుమన్నాడు

పెద్దకొడుకు.

" అన్నయ్య కూడా చనిపోతున్నాడు కాబట్టి ఆస్థి మొత్తం నాపేరుమీద రాసేయ్యి

నాన్నా " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు రెండో కొడుకు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోర్లు తెరిచారు తండ్రి, పెద్ద కొడుకు.
చిరుదరహసాన్ని చిరుకొపంతొ మరిచవా!
'నా' చిరుతప్పును ఓ చిరునవ్వుతో మరువలేవా?
నీ విరహపు సెగలతో సూర్యునికే విసుగు తెప్పించావు
నీ మదిలొని చల్లని వెన్నలతో నన్ను మైమరపించావు

 ఒకాయన చాలా పొదుపుగా మాట్లాడతాడని పేరు. ఏ మాట మాట్లాడినా ఆచి తూచి మాట్లాడేవాడు. అవసరానికి మించి ఒక్క మాటా మాట్లాడే వాడు కాదు.
ఒక రోజు ఏదో బ్రాండ్ బ్రష్ లను అమ్మడానికి ఒక సేల్స్ గర్ల్ వచ్చి తలుపు తట్టింది.
“ఎక్స్‌క్యూజ్ మి సర్. మీ వైఫ్ తో కొద్దిగా మాట్లాడచ్చా?”
“మా ఆవిడ ఇంట్లో లేదు.”
“ఓకే నేను ఆవిడ వచ్చే దాకా వెయిట్ చెయ్యచ్చా?”
“అలాగే అప్పటి దాకా ఈ డ్రాయింగ్ రూంలో కూర్చోండి” గది చూపించాడు.
1…2….3 గంటలు గడిచాయి. ఆయన భార్య జాడలేదు. విసుగొచ్చింది సేల్స్ గర్ల్ కి.
ఆయన దగ్గరకెళ్ళి “మీ ఆవిడ ఎక్కడకెళ్ళిందో తెలుసుకోవచ్చా?” అని అడిగింది.
“సమాధుల దగ్గరకెళ్ళింది”
“ఎప్పుడు తిరిగి వస్తుంది?”
“ఏమో నండి నాకు తెలీదు. వెళ్ళి దాదాపు పదకొండు సంవత్సరాలవుతోంది”
క్షణమైన నిలువని నా మనస్సు
నీ ఎదుట ఓ క్షణమైన నిలువదా!
నిలిచిన ఆ క్షణం జగతిని మరువదా!
మరచిన ప్రతి నిముషము నీ రూపం నా మదిని స్ప్రుశించదా!
స్పర్శించిన మరునిముషం నీపై ప్రేమ ఉదయించదా!
ఉదయించిన ఈ ప్రేమ కలకాలం జీవించదా!
కవులకు అందని భావం నీవు
కల్లలో నిలిచిన రూపం నీవు
నీవు కోరిన చిరునామా చెలి హృదయం
ఒంటరి హృదయానికి తోడు నీ ఊహలు
జంటగ చేరిన ప్రేమికులకు నీ ఊసులే...
అమ్మ ఒక ధరని మాత
మనస్సుతో పలికితే ప్రేమతనం
హృదయంతో పలికితే అమ్మ తనం
శ్వాసతో పలికితే తియ్యదనం
అమ్మ అక్షర ప్రవాహం అయ్యి మనల్ని
ఎప్పటికి నడిపిస్తూనే వుంటుంది ....
అమ్మ మన జీవితానికి సువర్ణ అధ్యానం
అమ్మ పలుకు ఆత్మీయత వెల్లువలుగా మారి
మన మనస్సుకు ఒక కొత్త తేజస్సును ఇస్తుంది ......
జాము రాత్రి వెండి వెన్నెల్లో జాబిలమ్మనై జోల పాట పాడనా,,,,,
చందమామకి ముచ్చట్లు చెప్పి నెలవంకతో ఉయ్యాలా ఉపించనా,....
రవి పుట్టే వెలుతురికి తెరవేసి కిరణాలాకి కునుకు రప్పించనా,.....
కురిపించవా ప్రేమ వర్షం,ఆణువణువూ ఆహ్లాదమై,.......
సాగవా నా సంతోషం నీవెంటే నేనుంట అంటూ,....
చే వీడని చిన్నారినై, నీ యదపై నిదురిస్తా చిరకాలం,....
కలలో కూడా కదిలో పోను కనుమరుగుగా,......
దక్కించుకోవా నను అష్ట దిక్కులకు వేద మంత్రాలు మోగించి.
సుస్వాగతం పలకవా నీ జీవితానికి వెయ్యేళ్ళు తోడు నీడనై
ఉంటా కడవరకు,....
నిజం ప్రియ
రెండు చోట్ల ఒకేసారి ఉన్నా
నీ హృదయంలో నాకు జోలపాడుతున్నపుడే
నీ లోకంలో నేను విహరిస్తున్నాను
ఇంత మాయ ఎక్కడైనా సాధ్యమా అనుకున్నా
నీ ప్రేమలో సాధ్యమే ....
కన్నులున్నా నీ రూపం,.....
చూడని నా కనులు గుడ్డిగా మారే,....
మాటలున్నా నీ పిలుపు,.....
వినని నా మాటలు మూగబోయే,....
హృదయమున్నా నీ ప్రేమని,.....
పొందని నా హృదయం మోడుబారే,....!!
అడుగులున్నా నడకలేని గమ్యానినై,...
దేహమున్నా శ్వాసలేని జీవినై,....
మనసున్నా మమతలేని మనిషినై,...
ఈ లోకంలోఒంటరిగా జీవిస్తున్న,.....!!
నిను మరువమని నాకు నేను నచ్చ చెప్పుకోలేక....
మరొకరికి మనస్పూర్తిగా నను నేను దాసోహం చెసుకోలేక,
స్నేహం పేరుతో మోసగించిన నిను కఠినంగా శిక్షించలేక,
నీ జ్ఞాపకాల ఉప్పెనలో సజీవ సమాదియాను,....!!
నువ్వు ఎక్కడ ఉన్నా....,
నా వద్దకి రాలేకున్నా.....,
కనుల యెదుట లేకున్నా....,
కలలు రాలిపోతున్నా......,
కానీ నా చూపులు......,
నీకోసం వెతుకుతూనే ఉంది...



బండ రాయిగా నను బంధించి,......
నీ ప్రేమ అనే పదునైన కత్తితో గుండెను గుచ్చి,...
ఆశల వలయమలోకి హారతి పట్టి,....
నిర్మానుశామైన ప్రదేశానికి నను రాణిని చేసి,....
నువ్వేమో నిరంతరం నవ్వుకుంటూ,....
నన్నేమో కదలేని నీ జ్ఞాపకాల,....
యాతన కూపంలోకి తోశావు,..



జ్ఞాపకాలు ముల్లులా గుచ్చుతుంటే నిన్ను మరిచిపోవాలని,
నీతో గడిపిన క్షణాలను తలచుకుంటూ జీవితాంతం
నీకోసం కన్నిలబిషేకం అర్పించలేను,......
అలాని నా మనసులో ఆవరించిన నీ ప్రేమని
మరోకరికోసం పూర్తిగా తుడిచివేసే ప్రయత్నం కూడా చేయలేను .
కాని నన్ను ప్రేమించలేదని నువ్వు వాదించినా,.....
నీ అంతరాత్మలో ఉన్నా నా నీడని ఏం చేయగలవో చూడు,....
రావా నేస్తం వేచి చూస్తున్న నేను
ఇంకేమి లేదు నీ ప్రేమకి నేను శరణు.
హృదయం నీ స్నేహంలో మునిగాక,
మరుభూమైన మనసుపై ప్రేమ వర్షం కురిసే,...
పెదవులు నీతో మాటలాడక పలకలేని
పదాలన్ని పదనిస పాట పాడే,....!!!
పువ్వులా నువ్వు నవ్వగా చిరుగాలికి కూడా రంగు వచ్చే
పొర్ణమిలా నువ్వు వచ్చాక చీకటికి కూడా వెలుగు వచ్చే
పగటి పుటనైనా నాలో నేనున్నాన అని,....
కళ్లుముసుకుంటే కనిపించే ఆ సరిజోడు,....
ప్రాణం నీ చెంతనే పెట్టుకొని నువ్వు వెళ్లిపోతుంటే,
అతిగా నను-నేను పిలుస్తూ ఉపిరి పోతున్నది చూడు,...!!
నా మరణమైన నిను రపిస్తుందని,ఈ జీవితానికి
సెలవు తీసుకుంటున్న నను మన్నించు,...
పూల బాట నీకై పరిచి వస్తే,ముల్ల దారిలో
నను విడిచి వెళ్లి పోతున్నావా,......??
గుండె వేగాన్ని నీకై పుష్పక విమానం చేసి
పంపిస్తే రాను అని పోమ్మన్నావా,....??
నీ ఆలాపనతో నా గమ్యాన్నే మరిపించావు,......
నీ ఉసులతో నే బ్రతుకున్న సంగతే మరిపించావు,.....
నను విడి నా చితికి నిప్పులు పరిచావు,.....!!
నీ ప్రేమ చిక్కులో నే చిక్కుకున్న అది నీకు తెలుసా,..??
నీ ఉహలె నా ఉపిరైనది అది నీకు తెలుసా,.....??
నీకై నా కళ్ల కాటుక వేచియున్నది అది నీకు తెలుసా,...??
నా మనసు మూలలో నీ రూపమే.......
ప్రాణమైనది అది నీకు తెలుసా,......??
ఏ నేరం చేయని నను శిక్షించడం నీ నిర్ణయమా,...??
నా ప్రేమంటే నీకు ఇంతా అలుసా మనసా,.......!! 










No comments:

Post a Comment